UPDATES  

NEWS

 15 ఏళ్లు మనదే అధికారం..-:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు దగ్గర ఏర్పాటు చేసిన ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సభ వేదిక నుంచి వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించారు ప్రధానీ మోదీ. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధాని మోదీ ఓ నిజమైన కర్మయోగి అని పవన్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు రెండు మూడు తరాల ప్రజలకు దిశా నిర్దేశం చేస్తున్నారని పవన్ తెలిపారు.

 

ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెడుతున్నారు. గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు దేశానికి ప్రత్యేకించి ఏపీకి వచ్చాయన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోంది. జీవిత, ఆరోగ్య భీమా సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గటం వల్ల ప్రజలు ఆదా చేసుకోగలుగుతారని పవన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని.. పెట్టుబడులు పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా.. అంతా కలిసే ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం అని తెలిపారు.

 

కాగా.. రూ. 13429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అలాగే రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు మోదీ.

 

శంకుస్థాపనలు:

 

విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ – రూ. 2886 కోట్లు

ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ – రూ. 4922 కోట్లు

కొత్త వలస – విజయనగరం మధ్య 4వ లైన్ – రూ. 493 కోట్లు

పెందుర్తి – సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ – రూ. 184 కోట్లు

సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి – రూ. 964 కోట్లు

 

ప్రారంభోత్సవాలు:

 

రేణిగుంట – కడప – మదనపల్లె రోడ్డు – రూ. 82 కోట్లు

కడప – నెల్లూరు – చునియంపల్లి రోడ్లు – రూ. 286 కోట్లు

కనిగిరి బైపాస్ రోడ్ – రూ. 70 కోట్లు

గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి – రూ. 98 కోట్లు

కల్యాణదుర్గం – రాయదుర్గం – మొలకలమూరు రోడ్డు – రూ. 13 కోట్లు

పీలేరు – కలసూర్ నాలుగు లేన్ల రోడ్ – రూ. 593 కోట్లు

నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం – రూ. 362 కోట్లు

చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ – రూ. 200 కోట్లు

 

జాతికి అంకితం:

 

కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు– రూ. 546 కోట్లు

శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ – రూ. 1730 కోట్లు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |