UPDATES  

NEWS

 ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది రాజా సాబ్’ ట్రైలర్ డేట్ వచ్చేసింది..! ఎప్పుడంటే..?

రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నుంచి ఓ కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అక్టోబర్ 2న రాబోతున్న ఈ ట్రైలర్‌ను, అదే రోజు విడుదలవుతున్న ‘కాంతారా చాప్టర్ 1’ సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఇప్పటికే ఈ ట్రైలర్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు సమాచారం. సుమారు 3 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌కు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. టీజర్‌లో రొమాంటిక్, కామెడీ అంశాలను చూపించిన దర్శకుడు మారుతి, ఈసారి అందుకు భిన్నంగా హారర్, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

 

ఈ సినిమా విడుదల తేదీపై కొంతకాలంగా ఉన్న సందిగ్ధతకు ట్రైలర్‌తో తెరపడే అవకాశం కనిపిస్తోంది. మొదట డిసెంబర్ 5న విడుదల చేయాలని భావించినా, తాజా సమాచారం ప్రకారం సినిమాను 2025 జనవరి 9కి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటనను ట్రైలర్‌లోనే చిత్రబృందం వెల్లడించవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో కీల‌క‌ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరగడంతో పాటు, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకుంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |