UPDATES  

NEWS

 సీఎం చంద్రబాబు కన్నెర్ర..! వారికి సీరియస్ వార్నింగ్..!

అరచేతిలోకి టెక్నాలజీ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యారు. చేయని తప్పని చేసినట్టు క్రియేట్ చేస్తున్నారు ప్రత్యర్థులు. ఫలితంగా కొందరు నేతలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ముందే పసిగట్టిన సీఎం చంద్రబాబు.. సమయం, సందర్భం లభించినప్పుడల్లా నేతలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొందరు ఎమ్మెల్యేలు ఏ మాత్రం పట్టించుకున్నపాపాన పోలేదు. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ వెనుక అసలేం జరుగుతోంది?

 

క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ. ఓ మోస్తరు కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఎవరు తప్పు చేసినా అస్సలు క్షమించరు అధినేత చంద్రబాబు. కచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అందుకే టీడీపీలో ఉన్న నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై అధినేతకు నివేదికలు వస్తుంటాయి. ఆ వ్యవహారాలు బాగా రచ్చయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.. ఇస్తున్న సందర్భాలు లేకపోలేదు.

 

ఆదివారం సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారని వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇదే క్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అధినేత సీరియస్ అయ్యారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు? ఒకరు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే కాగా, మరొకరు గుంటూరుకి చెందిన ఎమ్మెల్యే. ఇంకొకరు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే.

 

జరిగిన.. జరుగుతున్న వ్యవహారాలపై ప్రత్యర్థులు తాటికాయంత అక్షరాలతో పేపర్ బ్యానర్ వార్తలు, టీవీ ఛానెళ్లలో పదే పదే ప్రసారం చేస్తున్నారు. దీన్ని గమనించి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌. కేజీవీబీ ప్రిన్సిపాల్‌ సౌమ్యపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసినట్టు గుప్పుమన్నాయి. వీడియో కాల్ చేసి మహిళా ఉద్యోగులను వేధిస్తున్నట్లు హైకమాండ్ దృష్టికి వచ్చింది. తన మాట వినకుంటే బదలీ చేస్తానని ఉద్యోగులను ఆయన బెదిరించినట్టు పార్టీ దృష్టికి వచ్చింది. దీనిపై అధినేత కాసింత ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

 

మరొకరు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో ఆడియో వైరల్ అయ్యింది. తన పర్మిషన్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ వార్-2 ఎలా ప్రదర్శిస్తారో చూస్తానంటూ ఆయన మాటల ఆడియో సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఈ వ్యవహారం పార్టీలో రచ్చ అయ్యింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

 

మరొకరు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌. ఇటీవల ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం తీవ్రదుమారం రేగింది. వీటిపై బాధితురాలు నిజమేనని చెప్పడంతో ఈ యవ్వారంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ మూడు ఘటనలపై ఇవ్వాలని ఇవ్వాలని పార్టీని కోరారు. వీరిపై రేపో మాపో చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు పార్టీ నేతల మాట. ఇలాంటి సమస్యలకు ఆదిలో చెక్ పెట్టకుంటే మరిన్ని వచ్చే అవకాశముంటాయని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |