మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది.
సీబీఐ అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరిన అంశాలు ఇవే:
ఈ మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాలు చెప్పిన తర్వాత… వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఈ కేసులో అవినాశ్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దు కోరుతూ వివేకా కూతురు సునీత, సీబీఐ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. అవినాశ్ తో పాటు పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ, సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
Post Views: 55









