UPDATES  

NEWS

 పవన్ కళ్యాణ్ మూవీకి బిజినెస్ కష్టాలు..! ఆ ఏరియాల్లో బిజినెస్ నిల్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చాలా రోజుల తర్వాత థియేటర్లలో అభిమానులను పలకరించబోతున్నారు. ఈయన రాజకీయాల్లోకి వచ్చాక కొద్దిరోజులు సినిమాలు మరికొద్ది రోజులు రాజకీయాల్లో ఉంటూ కొన్ని సినిమాలు పూర్తి చేశారు.కానీ 2024 ఏపీ ఎలక్షన్స్ లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ , బీజేపీ తో పొత్తు పెట్టుకుని సక్సెస్ అయ్యారు. అలా రాజకీయాల్లో కొనసాగుతూనే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మూడు సినిమాలను పూర్తి చేయాలని అనుకున్నారు.

 

పవన్ కళ్యాణ్ సినిమాలు..

 

అలా హరిహర వీరమల్లు, ఓజి (OG) రెండు సినిమాలు పూర్తయ్యాయి. మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh) సినిమా మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ చాలాసార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు జూలై 24న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu)సినిమాకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. కానీ విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా ఈ సినిమాని ఆటంకాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటపడింది.

 

పవన్ కళ్యాణ్ మూవీకి బిజినెస్ కష్టాలు..

 

అదేంటంటే.. సినిమా విడుదలకు ముందే నైజాం, సీడెడ్ ఇలా ప్రతి చోట బిజినెస్ జరుగుతుంది. కానీ ఇప్పటివరకు నైజాం, వైజాగ్, బెంగళూరు, నెల్లూరు, చెన్నై (Chennai)వంటి ఏరియాల్లో హరిహర వీరమల్లుకు బిజినెస్ జరగలేదట.. అంతేకాదు బడా నిర్మాతలు అయినటువంటి మైత్రి (Mytri),దిల్ రాజు(Dil Raju),ఏసియన్ సునీల్ (Asian Sunil)వంటి వాళ్లు హరిహర వీరమల్లు మూవీ రైట్స్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదట. దీంతో విడుదలకు ముందు ఇబ్బందులు రాకుండా ఈ సినిమా నిర్మాత అయినటువంటి ఏఎం రత్నం(A.M. Ratnam) నైజాం ఏరియాలో ఓన్ గా విడుదల చేసుకుంటున్నారట. నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ కి మంచి క్రేజ్ ఉంది.అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు హరిహర వీరమల్లు ని పట్టించుకోలేదనే డౌట్ మీకు రావచ్చు. అయితే నైజాం (Nizam) ఏరియాలో ఈ మూవీ రైట్స్ ని దాదాపు 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి తీసుకోవాలని నిర్మాత చెప్పారట. దాంతో 50 కోట్ల అడ్వాన్స్ ఇవ్వడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరికి నిర్మాతనే స్వయంగా రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది.

 

ఆ ఏరియాలో బిజినెస్ కి నోచుకోని హరిహర వీరమల్లు..

 

అయితే ఈరోజు వరకు నెల్లూరు,బెంగళూరు, వైజాగ్(Vizag),చెన్నై, నైజాం వంటి ఏరియాలో సినిమా రైట్స్ ని ఎవరు కొనలేదట.. అయితే ఈ విషయం సినీ వర్గాల్లో వైరల్ గా మారడంతో చాలామంది హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ కి పండగే.. అలాంటిది భారీ అంచనాలతో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఎందుకిలా జరుగుతుందని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు దాదాపు రెండు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.దాంతో హరిహర వీరమల్లు సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. సినిమా చూడడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కానీ సినిమా కొనడానికి బయ్యర్లు మాత్రం ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.

 

అసలు కారణం ఏంటంటే..?

 

అయితే పవన్ కళ్యాణ్ సినిమాని కొనడానికి బయ్యర్లు ముందుకు రాకపోవడానికి కారణం చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాలేదు కాబట్టి సినిమాకి ఎక్కువ డబ్బులు పెట్టి నష్టపోతాం కావచ్చనే భయం లో బయ్యర్లు ముందుకు రావడం లేదట.అందుకే హరిహర వీరమల్లు సినిమాకి బిజినెస్ అవ్వలేదని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది పవన్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. మా హీరోకే ఇలా జరగాలా అంటూ బాధపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |