ఏపీ రాజధాని అమరావతి వేదికగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతిలో తిరిగి నిర్మా పనులు ప్రారంభించేందుకు టెండర్లు ఖరారయ్యాయి. ప్రపంచ బ్యాంకు తో పాటుగా హడ్కో నుంచి రుణం మంజూరు అయింది. పనుల ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించి ఘనంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి వేదికగా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. దీంతో, ఏప్రిల్ నెలలో అమరావతి వేదికగా కీలక పరిణామలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
సొంతింటి శంకుస్థాపన
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి నిర్ణయించారు. ఇందు కోసం శంకుస్థాపన తేదీ ఖరారు చేసారు. ఏప్రిల్ తొమ్మిదిన శంకుస్థాపన జరగనుంది. ఇప్పటికే సొంతింటి నిర్మాణం కోసం అమరావతిలోని వెలగపూడి గ్రామ పరిధిలో ఇంటి కోసం 5 ఎకరాలను ముఖ్యమంత్రి కుటుంబం కొనుగోలు చేసింది. ఆ స్థలాన్ని చదును చేసే పనులు పూర్తి చేస్తున్నారు. వెంటనే ఇంటి నిర్మా న్ని ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్థలాన్ని పరిశీలించిన వాస్తు సిద్ధాం తి కొన్ని కీలక సూచనలు చేసారు. గవర్నమెంట్ కాంప్లెక్స్ కి రెండు కిలోమీటర్ల దూరంలోనే చంద్రబాబు నివాసం నిర్మిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ కోసం
సీఎం చంద్రబాబు కృష్ణా ది ఒడ్డున ఉండవల్లిలో లింగమనేనికి చెందిన అతిథి గృహంలో గత పదేళ్లుగా ఉంటున్నారు. తాజాగా అమరావతిలో సువిశాల స్థలాన్ని కొనుగోలు చేశారు. భవిష్యత్తు కుటుంబ అవసరాలు, తన హోదా, వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థలం వైపు మొగ్గు చూపారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న 25 వేల చదరపు గజాల ప్లాట్ అనుకూలంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరున ఉన్న రిటర్నబుల్ ప్లాట్. ఇప్పటికే రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలిసింది. దీనికి నాలుగు వైపులా రోడ్డు ఉండడం ప్రధానంగా రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సెస్ దీని పక్క నుంచి వెళ్తుండడంతో ఈ స్థలాన్ని ఎంపిక చేశారు.
నిర్మాణ పనులు
చంద్రబాబు స్థలం సమీపంలో ఎన్జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, విట్ విశ్వవిద్యాలయం, తాత్కాలిక హైకోర్టు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పాటు రవాణా పరంగానూ అనుకూలతులు ఉన్నట్లు భావించి కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణం, పునాది పటిష్టం తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే పలుచోట్ల మట్టి పరీక్షలు కూడా జరిపారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్లో కొంత విస్తీర్ణంలోనే ఇంటిని నిర్మించేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన విస్తీర్ణంలో ఉద్యానవనం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, తదితర అవసరాల కోసం వినియోగించనున్నారు. రాజధాని పనుల ప్రారంభం వేళ ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణం నిర్ణయం స్థానికుల్లో ఆసక్తి కరంగా మారింది.









