మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భార్య అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ కాకుండా అందుకోవడంతో మెగా ఫాన్సీ నిరాశపడ్డారు. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 16వ సినిమాగా అది తెరకెక్కుతుంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 వేసవిలో విడుదల చేయాలన్నది ప్లాన్.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది..
రామ్ చరణ్ సినిమా ఇకమీదట ఏడాదికొకటి రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. అందరూ భాగంగానే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న మూవీని వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ భారత్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మార్చి 27 చరణ్ పుట్టిన రోజు. అందుకే ఈ డేట్ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ పుట్టిన రోజున ఓ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. టైటిల్ విషయంలో ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ మూవీకి పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ నెల 27న రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తే అయితే ఈ నెల 27న పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. త్వరలోనే దీని గురించి ఒక ప్రకటన రాబోతుందని సమాచారం.. నిజానికి రామ్ చరణ్ కు పెద్ది అనే టైటిల్ అస్సలు నచ్చలేదని ఆయన సన్నిహిత వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చరణ్ పుట్టినరోజు నాడు ఈ మూవీ టైటిల్ ను ఫిక్స్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదో స్పోర్ట్స్ డ్రామా. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అంటే ఓ ఆట చుట్టూ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా ఆటలు కనిపిస్తాయని, అందులో క్రికెట్ కూడా ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ మూవీలో ఎంఎస్ ధోని ఒక కీలక పాత్రలో నటించిన ఉన్నాడని టాక్.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల నైట్ ఎఫెక్ట్ లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీ తర్వాత సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఏడాదిలోనే ఆ సినిమాను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది.