తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారం కట్టబెట్టారు మంత్రి విక్రమార్క. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని, గత ప్రభుత్వలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నట్లు తన ప్రసంగంలో ప్రస్తావించారు.
కావాలని కొందరు దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో రెవిన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూల ధనం వ్యయం రూ. 36,504 కోట్లుగా ప్రతిపాదించారు.
తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి 16,12,579 కోట్లు. గత ఏడాదితో పోల్చితే 10.1 శాతం వృద్ధి రేటు. దేశ జీడీపీ 3 కోట్ల 31 లక్షల 3 వేల 215 కోట్ల రూపాయలు. అంటే వృద్ధి రేటు దాదాపు 9.9 శాతం. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,79,751 కోట్లు. వృద్ధిరేటు 9.6 శాతంగా ఉంది. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579, కాగా వృద్ ధిరేటు 8.8 శాతం ఉందని తెలిపారు. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,74,172 ఎక్కువగా ఉందని గుర్తు చేశారు.
అంతకుముందు బుధవారం ఉదయం బడ్జెట్ 2025-26 పేపర్లను ఉపముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 ను కేబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ కాపీలు అందజేశారు.
వివిధ రంగాలకు కేటాయింపు ఇలా..
రెైతు భరోసా పథకం రూ. 18,000 కోట్లు
వ్యవసాయం రూ. 24, 439 కోట్లు
పశుసంవర్థక శాఖ-రూ. 1,674 కోట్లు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు – రూ.11,600 కోట్లు
పౌర సరఫరాల శాఖ- రూ. 5,734 కోట్లు
విద్యాశాఖ రూ. 28, 108 కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 31,605 కోట్లు
మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ రూ. 2,862 కోట్లు
రైతు భరోసా పథకానికి – రూ.18 వేల కోట్లు
షెడ్యూల్ కులాల సంక్షేమం రూ.40, 232 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమం రూ. 17,169 కోట్లు
బీసీ సంక్షేమ శాఖ రూ.11, 405 కోట్లు
చేనేత రంగానికి రూ. 371 కోట్లు
మైనార్టీల సంక్షేమం రూ. 3,591 కోట్లు
పరిశ్రమల శాఖ రూ.3,527 కోట్లు
ఐటీ శాఖకు రూ. 774 కోట్లు
విద్యుత్ శాఖ రూ. 21, 221 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12, 393 కోట్లు
మున్సిపల్-పట్టణాభివృద్ధి శాఖ రూ.17,677 కోట్లు
నీటి పారుదల శాఖ రూ.27,373 కోట్లు
రోడ్లు-భవనాల శాఖ రూ.5,907 కోట్లు
టూరిజం శాఖ రూ.775 కోట్లు
క్రీడల శాఖకు రూ.465 కోట్లు
అడవులు-పర్యావరణ శాఖకు రూ.1,023 కోట్లు
దేవాదాయ శాఖకు రూ.190 కోట్లు
హోంశాఖకు రూ.10,188 కోట్లు