హీరోయిన్ రన్యా రావు గురించి ఇప్పుడు పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దుబాయ్ నుంచి గోల్డ్ను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్ వెళ్లిన ఆమె కదలికలపై అధికారులు నిఘా ఉంచారు. మార్చి 3న దుబాయ్ నుంచి వచ్చిన రన్యా రావు వద్ద కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. ఆమె రిమాండ్ కు తరలించిన పోలీసులు ఆమె వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ జరిపిస్తున్నారు.. ఇక తాజాగా ఈరోజు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఈరోజు కేసులో భాగంగా పోలీసులు తెలుగు నటుడిని అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు హీరో అరెస్ట్..
రన్యా రావు కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈరోజు కేసుతో సంబంధం ఉన్న హీరో రాజ్ తరుణ్ కొండుకూరును పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసులు అలాగే డిఆర్డిఐ అధికారులు రిమాండ్కు తరలించారు. ఈ హీరో పరిచయం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ అరెస్ట్ తో ఈ కేసు మరో మలుపు తిరిగింది మరి ఇంకా ఈ కేసులో ఎటువంటి బడనాయకులు ఉన్నారో బయటకొచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలుపుతున్నారు.
రన్యా రావు భర్త స్టేట్మెంట్..
నాలుగు నెలల క్రితం బెంగళూరులో రన్యా, జతిన్‌ల వివాహం జరిగింది. వివాహం తర్వాత వీరు లావెల్లీ రోడ్డులోని ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. జతిన్ ఆర్వీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఆర్కిటెక్చర్ , ఇంటీరియర్ డిజైనింగ్‌లో పట్టా పొందారు. ఇంటీరియర్ డిజైనర్‌గా , బెంగళూరులో ఒక రెస్టారెంట్ యజమానిగా ఉన్న జతిన్ తన వ్యాపారాన్ని ముంబై, ఢిల్లీ నగరాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో వీరిద్దరూ కలిసి అనేకసార్లు దుబాయ్ కి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసుల విచారణలో జతిన్ మేమిద్దరం పెళ్లైన నెలకే విడివిడిగా ఉంటున్నామని ఆయన అన్నారు. అధికారికంగా ఇంకా విడాకులు తీసుకోలేదని జతిన్ చెప్పడంతో పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకోకుండా వదిలేశారు. మరోసారి జతిన్ విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు తెలుపుతున్నారు..
ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు అటు సిబిఐ అధికారులు కేసులో ఉన్న అసలు దోషులను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలువురి పై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. అయితే ఈ స్మగ్లింగ్ కేసులో బడా నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.. త్వరలోనే పూర్తి వివరాను వెళ్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హీరోయిన్ ఇలాంటి కేసులో ఇరుక్కోవడం కన్నడ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తుంది.. ఇటీవల కన్నడ స్టార్స్ అరెస్ట్ అవ్వడం కామన్ అయ్యింది.