UPDATES  

NEWS

 నంద్యాల పర్యటన పై నోరు విప్పిన అల్లు అర్జున్..! పవన్ కల్యాణ్ పై షాకింగ్ కామెంట్స్..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ NBK. ఇప్పటికే మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా హిట్ చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం కేవలం ప్రమోషన్స్ కోసమే ఈ సీజన్ స్టార్ట్ చేశారా.. ? అని అనిపించక మానదు. స్పెషల్ గెస్టులు అయినా కూడా అందరూఒ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికే ఈ షోకు వస్తున్నారు.

 

మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు గెస్ట్ గా వచ్చారు. ఇక దాన్ని మినహాయిస్తే.. రెండో ఎపిసోడ్ కు లక్కీ భాస్కర్ టీమ్ సందడి చేసింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షీ, సూర్యదేవర నాగవంశీ, వెంకీ అట్లూరి వచ్చారు. ఇక ముచ్చటగా మూడో ఎపిసోడ్ లో కంగువ టీమ్ హల్చల్ చేసింది. సూర్య, డైరెక్టర్ శివ, విలన్ బాబీ డియోల్ తో బాలయ్య ఒక ఆట ఆడుకున్నాడు. ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత బాలయ్య షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేశాడు.

 

అప్పుడెప్పుడో పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా వచ్చాడు. ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్స్ లో ఇంకోసారి సందడి చేశాడు. అయితే ఈసారి మాత్రం బన్నీ- బాలయ్య ఆట కోసం కాదు .. బన్నీ చెప్పే సమాధానాల కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది అల్లు అర్జున్ జీవితంలో చాలా అనుకోని సంఘటనలు జరిగాయి. అందులో నంద్యాల పర్యటన కూడా ఒకటి. సొంత మామ పవన్ కళ్యాణ్ పార్టీకి సపోర్ట్ చేయకుండా.. భార్యకు ఫ్రెండ్ అయిన వైసీపీ నేత ఇంటికి వెళ్లి వారికి బన్నీ ఆల్ ది బెస్ట్ చెప్పడం సెన్సేషన్ సృష్టించింది.

 

ఇక అప్పటి నుంచి ఈ క్షణం వరకు సందు దొరికినప్పుడల్లా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా బాలయ్య షోలో బన్నీ.. నంద్యాల పర్యటన గురించి నోరువిప్పాడు. ఇప్పటివరకు ఫన్ ప్రోమోస్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా పవర్ ఫుల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో పవన్, ప్రభాస్ ఫోటోలను చూపించి వారి గురించి చెప్పమని బాలయ్య, బన్నీని అడిగాడు.

 

పవన్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నంద్యాల పర్యటన గురించి చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. తన దారిలో తాను వెళ్ళిపోతాడు అని బాలయ్య అనగానే.. అంతే అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ” ప్రభాస్ ను ఎప్పుడు చూసినా సార్.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నాది ఒకటే మాట.. ఆరడుగుల బంగారం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ షోలో బన్నీ ఎలాంటి సమాధానాలు చెప్పాడో తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |