వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి విడదల రజినికి షాక్ తగిలింది. అక్రమ కేసులతో తమను వేధించారని విడదల రజినిపై పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావుకు చిలకలూరిపేట ఐటిడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు జయ ఫణీంద్ర కుమార్, రామకృష్ణ కూడా తమను వేధించారని వారు తెలిపారు.
విడదల రజినితో పాటు పలువురిపై ఫిర్యాదు
గతంలో చిలకలూరిపేట అర్బన్ సీఐగా విధులు నిర్వహించిన సూర్యనారాయణ పైన కూడా వారు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటితో పాటు పలువురు టిడిపి శ్రేణులు నేడు పల్నాడు ఎస్పీని కలిసి వైసిపి ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి విడదల రజిని టిడిపి కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
లైవ్ లో చూస్తూ విడదల రజిని పైశాచిక ఆనందం
పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలను లైవ్ లో చూస్తూ విడదల రజిని పైశాచిక ఆనందం పొందారని వారి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తే తమను చంపేస్తామని నాడు తమను తీవ్రంగా బెదిరించారని వారు తమ ఫిర్యాదులో వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో విడదల రజిని ఆదేశాలతో తమను చిత్రహింసలకు గురి చేసిన వారిపై చర్య తీసుకోవాలన్నారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ వేళ వైసీపీకి మరో షాక్
మాజీ మంత్రి విడదల రజినీ పైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు పల్నాడు ఎస్పీని కోరారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి విడదల రజిని పైన ఆమె వ్యక్తిగత సహాయకులతో పాటు పలువురిపైన ఐతెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో
మాజీ మంత్రి విడదల రజిని పైన, ఆమె పిఏ లపైన విచారణ జరిపి కేసు నమోదు చేయాలని వారు ఎస్పిని కోరారు. మరి ఐ టి డి పి కార్యకర్తల ఫిర్యాదు నేపథ్యంలో ఎస్ పి ఈ వ్యవహారంలో ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నది తెలియాల్సి ఉంది. గతంలో రఘురామ కృష్ణంరాజును పోలీసులు తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేసినట్టే, అచ్చం అలాగే తమను కూడా చిత్ర హింసలు పెట్టారన్న ఐటీడీపీ కార్యకర్తల ఫిర్యాదుపై ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.