UPDATES  

NEWS

 అన్‌స్టాపబుల్‌ గెస్ట్ గా మరోసారి అల్లు అర్జున్..!

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా రూపొందుతున్న కార్యక్రమం అన్‌స్టాపబుల్‌. బుల్లితెరపై ఇది సంచలన కార్యక్రమంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షో రెండు సీజన్‌లను పూర్తి చేసుకుంది. త్వరలో మూడో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంతో బాలకృష్ణకు వచ్చిన కొత్త ఇమేజ్‌ అంతా ఇంతా కాదు. ఇంటిల్లిపాది ఆయన అన్‌స్టాపబుల్‌ కార్యక్రమాన్ని ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు.

 

ఈ మూడో సీజన్‌లో యువ కథానాయకుడు అల్లు అర్జున్‌తో ఓ ఎపిసోడ్‌ను షూట్‌ చేశారు. ఈరోజు దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. ఈ కార్యక్రమానికి వచ్చే గెస్ట్ ల చేత పలు వివాదాస్పద ప్రశ్నలకు బాలయ్య సమాధానాలు చెప్పిస్తుంటారు. అప్పటి వరకు ఎవరికి తెలియని రహస్యాలను కూడా ఈ ‘ఆహా’ కార్యక్రమంలో బాలకృష్ణ చెప్పిస్తుంటారు.

 

తాజాగా జరిగిన అల్లు అర్జున్‌ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌లో ఎన్నో ప్రశ్నలకు బన్నీ నుండి సమాధానాలు రాబట్టారని తెలిసింది. ముఖ్యంగా అందరిలో వున్న కొన్ని సందేహాలకు కూడా ఆయన ఈ ఎపిసోడ్‌లో సమాధానాలు ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌తో బన్నీ అనుబంధం, నంద్యాల ఎపిసోడ్‌తో పాటు పుష్ప-2 చిత్రం గురించి విశేషాలను ఈ ఎపిసోడ్‌లో చూడొచ్చని అల్లు అర్జున్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 

అయితే గతంలో దర్శకుడు సుకుమార్‌తో అన్‌స్టాపబుల్‌ జరిగినప్పుడు అల్లు అర్జున్‌ గెస్ట్‌గా వచ్చి కాసేపు అలరించాడు. బన్నీతో జరిగిన ఈ ఎపిసోడ్‌ లో పలువురు సర్ ప్రైజింగ్ గెస్ట్‌లు కూడా వున్నారనిటాక్‌.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |