ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి వంద రోజుల నేపథ్యంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తోంది. తొలి విడతగా 20 మంది పేర్లను ప్రకటించింది. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నేతలకు చోటు కల్పించింది. ప్రకటించిన 20 పదవుల్లో టీడీపీకి-16, జనసేనకి-3, బీజేపీకి ఒకటి కేటాయించింది.
ఆర్టీసీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను నియమించింది చంద్రబాబు సర్కార్. వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ హజీజ్, శాప్ ఛైర్మన్‌గా రవినాయుడు, గృహ నిర్మాణ బోర్డు ఛైర్మన్‌గా తాతయ్య నాయుడు, మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా కర్రోతు బంగర్రాజు, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మన్యం సుబ్బారెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా లంకా దినకర్ నియమితులయ్యారు.
ఈ జాబితాను చూడగానే కొంతమంది ఆశావహులు సైలెంట్ అయ్యారు. మరో రెండు జాబితాలు ఉన్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కొంతమంది నేతలకు హైకమాండ్ నుంచి సంకేతాలు వెళ్లినట్టు అంతర్గత సమాచారం. నామినేటెడ్ పోస్టులు దాదాపు 50 నుంచి 70 వరకు ఉండవచ్చంటూ వార్తలు వస్తున్నాయి.
నామినేటెడ్ పోస్టుల ఎంపికలో సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇటు జనసేన, అటు బీజేపీతో మంతనాలు సాగించారు. పొత్తు నేపథ్యంలో సీట్లు కోల్పోయినవారికి, పార్టీ కోసం సర్వం కోల్పోయి జైలుకి వెళ్లినవారిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.