UPDATES  

NEWS

 హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు..!

ఆక్రమణ కూల్చివేతలపై దూసుకెళ్తున్న హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై న్యాయస్థానం స్టే విధించింది. స్థానికల పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు అయింది. దీంతో హైకోర్టు హైడ్రాకు కీలక సూచనలు చేసింది.

 

దుర్గం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ హైడ్రా స్థానికులకు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నోటీసుల పైన స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. 2014లో జారీ చేసిన ప్రిలిమరి నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రొటెక్షన్ కమిటీ స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అక్టోబర్ 4న ప్రొటెక్షన్ కమిటీ ముందు నివాసితులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది.

 

 

అదే సమయంలో అక్టోబర్ 4 నుంచి ఆరు వారాల లోపు నోటిఫికేషన్ జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు తాజా ఆదేశాలతో దుర్గం చెరువు నివాసితులకు తాత్కాలికంగా ఊరట దక్కింది. మరోవైపు నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మాదాపూర్ లో హైడ్రా సిబ్బంది కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను కూల్చివేశారు.

 

పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. అనంతరం కావూరి హిల్స్ పార్క్ అని అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. అయితే కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 ఏళ్ల పాటు తాము లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు వాదిస్తున్నారు. గడువు మూగీకముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా హైకోర్టు హైడ్రాకు ఇచ్చిన ఆదేశాలతో దుర్గం చెరువు వాసులకు రిలీఫ్ దక్కింది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |