UPDATES  

NEWS

 దేశవ్యాప్తంగా మధ్యంతర ఎన్నికలు..?

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. అదే సమయంలో తమ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పేశారు. దీంతో వచ్చే ఐదేళ్లలోపే మధ్యంతర ఎన్నికలు తప్పవని తేలిపోయింది. అయితే ఈ జమిలి ఎన్నికలు దాదాపుగా ఎప్పుడు ఉండొచ్చన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే జమిలి కోసం చేయాల్సిన కీలక మార్పులే కారణం.

 

జమిలి కసరత్తు

 

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా కసరత్తే అవసరం. ఇప్పటివరకూ జమిలి ఎన్నికలు అవసరమా లేదా, వీటి వల్ల లాభనష్టాలపైనే కసరత్తు జరిగింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో జమిలి ఎన్నికల నిర్వహణ తప్పదని తేలిపోయింది. ఇప్పుడు జమిలి ఎన్నికలు ఎప్పుుడ పెట్టాలన్న దానిపై కసరత్తు జరగాల్సి ఉంది. దీనికోసం ముందుగా పార్లమెంట్ లో మూడింట రెండొంతుల మెజార్టీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలి. ఇది జరిగిపోతే ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర, ఎన్నికల షెడ్యూల్స్ ఖరారు వంటి చర్యలు వేగవంతమవుతాయి.

 

జమిలి బిల్లు

 

పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు, దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా కష్టం కాకపోవచ్చు. కాబట్టి ఆ తర్వాత జరిగే కసరత్తు ఏంటో తెలుసుకుందాం. జమిలి ఎన్నికల కోసం ఎన్నో కొన్ని అసెంబ్లీల పదవీకాలం పొడిగించడం, మరికొన్ని అసెంబ్లీల పదవీకాలం తగ్గించాల్సి ఉంటుంది. అయితే వీటి సంఖ్య ఎంత తక్కువ ఉంటే అన్ని సమస్యలు తగ్గుతాయి. కాబట్టి వీటి ఆధారంగా పరిశీలిస్తే జమిలి ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చన్న క్లారిటీ వచ్చేస్తుంది.

 

అసెంబ్లీల గడువు

 

2027లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీకాలం ముగిసిన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే 2028 ఫిబ్రవరి-మే మధ్య కర్నాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్,నవంబర్లో తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్దాన్, మిజోరం అసెంబ్లీల పదవీకాలం పూర్తయి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అలాగే 2029లో ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూకశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీల పదవీకాలం ముగిసిన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

 

జమిలికి ఇదే ముహుర్తం..?

 

అంటే 2027 నుంచి 2029 మధ్య ఏకంగా 24 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి. 2029లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉంటాయి. 2027 నుంచి 2028 మధ్య అయితే 16 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 2029లో జరగాల్సిన 8 రాష్ట్రాల ఎన్నికలను, లోక్ సభ ఎన్నికలను ముందుకు జరిపితే 2028లో జమిలి ఎన్నికలు పెట్టేయొచ్చు. దీని వల్ల 2027లో ఎన్నికలు పెండింగ్ ఉన్న 7 రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం పొడిగించాల్సి ఉంటుంది. వీటిలో హిమాచల్, పంజాబ్ మినహా మిగిలిన చోట్ల బీజేపీయే అధికారంలో ఉంది. కాబట్టి ఈ 7 రాష్ట్రాల అసెంబ్లీ గడువు పొడిగిస్తే 2028లో జమిలి నిర్వహణకు అనుకూలంగా ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |