మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. తాజాగా చెర్రీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. చాలా కాలంగా ఈ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. మరి ఆ ట్రీట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పైనే అందరి దృష్టి ఉంది. చాలాకాలంగా చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ ఎలా రూపొందిస్తున్నారు ? అసలు స్టోరీ ఏంటి? సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది ? ఇలా రకరకాల ప్రశ్నలు మెదులుతున్నాయి అభిమానుల మెదళ్ళలో. ఒక్క అప్డేట్ అంటూ చాలా కాలంగా సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అభిమానులు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఎన్నో రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా ఒక్క సాలిడ్ అప్డేట్ కూడా ఇవ్వలేదు మేకర్స్. అప్పుడెప్పుడో ఒక పోస్టర్ ను, ఆ తర్వాత ఒక పాటను రిలీజ్ చేశారు తప్పితే ఇప్పటి వరకు సరైన అప్డేట్ లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్స్ విషయంలో గరంగరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ గురించి ఒక ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే ఈ మూవీ ట్రైలర్ అప్డేట్. దసరా రోజున గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసి మెగా ఫాన్స్ ను శంకర్ కూల్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం చెర్రీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు రెడీ అవ్వండమ్మా.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఈ మూవీ షూటింగ్ టైంలో శంకర్ భారతీయుడు 2 సినిమా పై ఫోకస్ చేయడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పటిదాకా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేనేలేదు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు అని ఒక క్రేజీ న్యూస్ చాలా కాలంగా వైరల్ అవుతుంది. మరోవైపు డిసెంబర్ 20న మూవీని రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి గేమ్ ఛేంజర్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని ట్రైలర్ లో అయినా వెల్లడిస్తారా? ఇప్పటికైనా శంకర్ ఒక క్లారిటీతో ఉన్నారా? అనే విషయం తెలియాలంటే ట్రైలర్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సి.