విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ మంగళ, బుధ వారాల్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల్లోని నేతలో ఆయన సమావేశం కానున్నారు.
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నేతలెవరూ జగన్‌ను కలిసేందుకు అవకాశం లేదని వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Post Views: 46