సంచలనాలకు మారు పేరుగా బిగ్‌బాస్ రియాల్టీ షో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది.
అయితే ఇది మన దేశ సంప్రదయాలకు విరుద్దంగా ఉందని చాలామంది ఈ షోపై విమర్శలు చేశారు. మిగిలిన భాషలతో పోలిస్తే…హిందీలో రొమాన్స్ కాస్తా ఎక్కువుగానే కనిపిస్తుంటుంది. ఈ షోకు వెళ్లి ప్రేమికులకు మారిన వారు కొందరైతే..అక్కడి వెళ్లి విడిపోయిన వారు మరికొందరు. ఇక బిగ్‌బాస్ షోలో ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా నిర్వహించారనే వార్త అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. బిగ్‌బాస్ హౌస్‌లో శృంగారంపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి.
తెలుగులో కూడా ఈ రియాల్టీ షో సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహారించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన సినిమా షూటింగ్‌ల కారణంగా బిగ్‌బాస్ షో నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ ప్రారంభం కాబోతుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కొత్త సీజన్ మొదలు కానుంది. అయితే ఈసారి పెద్ద సెలబ్రిటీలను షోకు తీసుకు రావడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే హీరోయిన్ సమీరా రెడ్డిని బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
సమీరా రెడ్డికి ఒకప్పుడు హిందీతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. గతంలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి ప్రేమించుకున్నారనే వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సైతం ఓ ఇంటర్య్వూలో అంగీకరించారు.పెళ్లి చేసుకుందమనకునే సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ, వీరిద్దరు విడిపోయారు. సమీరా రెడ్డి తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తే.. రెండు సినిమాలు ఎన్టీఆర్‌తోనే నటించారు.
నరసింహుడు, అశోక్ సినిమాల్లో ఎన్టీఆర్‌తో నటించగా, చిరంజీవితో జై చిరంజీవా సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలో నటించకపోయినప్పటికీ ఆమెను మాత్రం ప్రేక్షకులు మరువలేదు. దీంతో ఎలాగైనా ఆమెను బిగ్‌బాస్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి అందరు ఆశించినట్టు సమీరా రెడ్డి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.