UPDATES  

NEWS

 రూ.500 నోటుపై కీలక ప్రకటన చేసిన ఆర్‌బీఐ..!

రూ.500 కరెన్సీ నోటుపై కొద్దిరోజులుగా చిత్ర విచిత్రమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి అసలా? లేదంటే అబద్దపు వార్తలా? అన్న విషయంలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. దీంతో భారతీయ రిజర్వు బ్యాంకు వీటిపై స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవమని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో స్పష్టం చేసింది. రూ.500 నోటుపై స్టార్ గుర్తు ఉన్నవన్నీ నకిలీ నోట్లంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. సీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ విషయాన్ని ఎక్స్ లో వెల్లడించింది.

స్టార్ గుర్తుకు అర్థం చెప్పిన ఆర్‌బీఐ స్టార్ గుర్తు ఉన్న నోట్లు 2016 డిసెంబరు నుంచి మార్కెట్ లో చలామణి అవుతున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా చలామణి చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు వివిధ నోట్లను అందుబాటులోకి తెస్తోంది. వీటిపై సీరియల్ నెంబరు ముద్రిస్తారు. అయితే కొన్ని నోట్లపై స్టార్ గుర్తు ఉండటంతో అలాంటివి చెల్లవంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారు. గతంలో కూడా ఈ తరహాలోనే వార్తలు వస్తే రిజర్వు బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ మళ్లీ అదే తరహా వార్తలు చలామణి అవుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు ఇతర నోట్లులానే చెల్లుతాయని, సీరియన్ నెంబరుకు, ప్రిఫిక్స్ కు మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుందని చెప్పింది. అసలు స్టార్ గుర్తు అంటే అర్థం ఏమిటో వివరించింది. రీప్లేస్ చేసి తిరిగి ముద్రించిన నోట్లు అని అర్థం వస్తుంది. వీటిని సులువుగా గుర్తించడానికి స్టార్ గుర్తును వాడుతున్నారు.

నాణ్యత లేని కాగితాన్ని వాడుతున్నారు 2017లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేసి తర్వాత రూ.2వేల నోటును, రూ.500 నోటును, రూ.200 నోటును తీసుకొచ్చింది. వీటితోపాటు రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని చూసిన ప్రజలంతా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నలుగురి చేతులు మారితే వెంటనే చినిగిపోతున్నాయని, అంతటి నాణ్యతలేని కాగితాన్ని వాడుతున్నారంటూ మండిపడుతున్నారు. నోట్లు ముద్రించడం చాతకాకపోతే మెదలకుండా ఉండటం ఉత్తమమని, అలా కాకుండా నాణ్యత లేని నోట్లు, అందులోను సరిసంఖ్యలో ఎవరైనా రూ.2వేల నోట్లు, రూ.200 నోట్లు తెస్తారా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |