UPDATES  

NEWS

 రేషన్ బియ్యం స్కామ్ లో ఐపీఎస్ లు, చంద్రబాబు, పవన్ ఆదేశాలతో, మంత్రి నాదెండ్ల..

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం దెబ్బకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు పలు శాఖల అధికారులకు తడిచిపోతావుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారిపడుతోందని, ప్రభత్వం అందించే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న స్కామ్ లో ఐదు మంది ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

విజయవాడలో ఏసీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్ ప్రారంభించిన పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ఐపీఎస్ అధికారుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు మంది ఐపీఎస్ అధికారుల సహకారంతో పేదలకు అందిచాల్సిన రేసన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని, పేదల కడుపుకొట్టడానికి ప్రయత్నించే వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

 

రేషన్ అక్రమ రావాణాలో ప్రేమయం ఉన్న ఆ ఐదు మంది ఐపీఎస్ అధికారులను గుర్తించామని, చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.. ఇప్పటికే కాకినాడలో 43 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశామని, ఆ బియ్యం సేకరించింది ఎవరు ?, ఎక్కడికి తరలించాలని ప్రయత్నిస్తున్నారు అని పూర్తి సమాచారం సేకరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

 

ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పేదలకు రాయితీపై ఐదు కిలోల బియ్యం, ఒక కేజీ కందిపప్పు అందిస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు మనవి చేశారు. వీటితో పాటు నిత్యవసర వస్తువులు అందివ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో చక్కెరతో పాటు చిరుదాన్యాలు రైతు బజార్లో సామాన్యులకు అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ బియ్యం అక్రమాల్లో పాలుపంచుకున్న ఆ ఐదు మంది ఐపీఎస్ అధికారులు ఎవరు ? అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |