విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందని డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి కారణమైంది. డెక్కన్ క్రానికల్ రాసిన కథనంపై మంత్రి నారా లోకేష్ స్పందించడం, వైసీపీ కుట్రగా ఆయన అభివర్ణించడం, విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేయడానికి రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెక్కన్ క్రానికల్ కథనంపైన ఒక్కసారిగా అందరి ఫోకస్ పడింది.
డెక్కన్ క్రానికల్ కథనం రచ్చ విశాఖ స్టీల్ ప్లాంట్ పై డెక్కన్ క్రానికల్ కథనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం డిస్ ప్లే బోర్డును తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. దీంతోడెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద డిస్ ప్లే బోర్డు పైన జరిగిన దాడిపైన, అలాగే నారా లోకేష్ ఆరోపణల పైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ బాటలో టీడీపీపై వైఎస్ షర్మిల ఎటాక్ చేశారు.
డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై టీడీపీ దాడిని ఖండించిన షర్మిల విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయం పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడిని వైయస్ షర్మిల ఖండించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మొన్నటిదాకా జగన్ నే టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు జగన్ బాటలో టీడీపీపై విరుచుకు పడ్డారు. ఈ ఘటనతో జగన్ అభిప్రాయంతో ఏకీభవించి వైఎస్ షర్మిల మద్దతిచ్చారు.
దమ్ముంటే మోడీని నిలదీయండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక ఎదురు ఈ చర్యలా? అంటూ ప్రశ్నించారు. మేలుకోకపోతే రేపు ప్రజలు మీకు జవాబు చెప్తారని తేల్చి చెప్పారు. దమ్ముంటే మోడీని నిలదీయండి, అంతేకానీ నిలదీసే గొంతులపై ఉక్కు పాదం మోపొద్దు అంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఇటువంటి దాడులను కచ్చితంగా వ్యతిరేకిస్తుంది అంటూ షర్మిల పేర్కొన్నారు.
షర్మిల ఫోకస్ మారుతుందా? ఇక దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కొత్త చర్చ జరుగుతుండగా డెక్కన్ క్రానికల్ వార్త వ్యవహారం ఏపీలో దుమారంగా మారింది. రాజకీయంగా రచ్చ చేస్తుంది. తాజా స్పందనలతో షర్మిల ఫోకస్ ఇక నుండి టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఫిక్స్ అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.