హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని లావణ్య అనే యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. అతను.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో ఎఫైర్ పెట్టుకొని తనను వదిలేసాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తామిద్దరం ఏడేళ్లుగా కలిసే ఉంటున్నామని, గుడిలో తనను పెళ్లి చేసుకున్నాడని కూడా తెలిపింది.
ఇంకోపక్క రాజ్ తరుణ్.. ఒకప్పుడు లావణ్యతో ప్రేమలో ఉన్న విషయం నిజమే కానీ, ఆమె డ్రగ్స్ తీసుకోవడం, తనను కూడా డ్రగ్స్ తీసుకోమని బలవంతపెట్టడంతో లావణ్య నుంచి దూరమయ్యాయని, ఇప్పుడు ఆమెకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆమె.. మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని, ఇప్పుడు తన పరువు తీయడానికే ఇదంతా చేస్తుందని తెలిపాడు. మధ్యలో లావణ్య ఎక్కడకు వెళ్లిందో తెలియదు కానీ, కనిపించకుండా పోయింది.
ఇక పోలీసులు సైతం లావణ్య వ్యవహారం కొంచెం తేడాగా ఉందని, ఆధారాలు ఉన్నాయని చెప్పిన వాటిలో చాలా తప్పుకు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక లావణ్య.. రాజ్ తరుణ్ కు ఒక అమ్మాయితో కాదు చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉందని, బిగ్ బాస్ బ్యూటీ అరియనాతో కూడా రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉన్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక్క ఇంటర్వ్యూ అరియనా జీవితాన్ని మొత్తాన్ని మార్చిసింది. ఇక ఈ ఇంటర్వ్యూతో వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ లోకి వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకుంది.
ఇక హౌస్ నుంచి బయటకు రాగానే అమ్మడికి సినిమా ఆఫర్ వచ్చింది. రాజ్ తరుణ్ నటించిన అనుభవించు రాజా అనే చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటించింది. ఆ సమయంలోనే ఆమె రాజ్ తరుణ్ అంటే తనకు నచ్చదని చెప్పుకొచ్చింది. టీవీలో అతని సినిమాలు వస్తే తీసేయమని చెప్పేదాన్ని అని, కారులో వెళ్తుంటే రాజ్ తరుణ్ కు యాక్సిడెంట్ అవ్వాలని కోరుకున్నట్లు కూడా తెలిపింది. ఇకఅలంటి అరియనాతో రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందని లావణ్య ఆరోపించింది.
” అరియనాతో కూడా రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉంది. అరియానా గ్లోరీతో ఒక్కరోజు మాత్రమే షూటింగ్‌కి వెళ్లాడు. ఆ తరువాత నేను గోవా వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్కడ నేను ఉన్న నెలరోజుల్లో వీళ్లు ఇక్కడ బాగా కలుసుకున్నారు. ఈ విషయం నాకు రాజ్ తరుణ్ మేనేజర్, నటుడు రాజా రవీంద్ర ఫోన్ చేసి చెప్పాడు. లేకపోతే రాజ్ తరుణ్ గుట్టు బయటపడేది కాదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై రాజ్ తరుణ్, అరియానా ఎలా స్పందిస్తారో చూడాలి.