రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. మంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు శనివారం సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు.ఈ సమయంలోనే చంద్రబాబు వద్ద రేవంత్ కీలక ప్రతిపాదనలకు సిద్దమయ్యారు. టీటీడీతో సహా పలు అంశాల్లో భాగం కావాలని కోరుతున్నారు. దీని పైన చంద్రబాబు స్పందన ఏంటనేది కీలకంగా మారుతోంది.
ఇద్దరు సీఎంల భేటీ విభజన సమస్యల పరిష్కారం పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. అందులో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న షెడ్యూల్ 9, 10 సంస్థలతో పాటుగా విద్యుత్ సంస్థల బకాయిల పైన చర్చించనున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఈ భేటీలో చంద్రబాబు ముందు అనూహ్య ప్రతిపాదనలతో సిద్దమయ్యారు. అందులో ప్రధానంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కలుపబడ్డ 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలిని కోరేందుకు సిద్దమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000కి.మీ మేర విస్తారమైన తీరప్రాంతం ఉంది. తెలంగాణకు ఈ తీరప్రాంతంలో భాగం కావాలని కోరుతున్నారు.
భాగం కావాలి ఇక, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వేంకటేశ్వరస్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం కావాలని కీలక డిమాండ్ చంద్రబాబు ముందు ఉంచనున్నారు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలిని కోరుతున్నారు. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలని రేవంత్ ప్రతిపాదిస్తున్నారు. తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలని రేవంత్ డిమాండ్ కోరుతున్నారు.
బకాయిలపైనా చెల్లింపులు తెలంగాణ విద్యుత్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలని రేవంత్ ప్రధాన అంశంగా ప్రస్తావించనున్నారు. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని చెల్లించడం జరుగుతుందని చెప్పేందుకు సిద్దమయయ్యారు. సీఐడీ హెడ్‌క్వార్టర్స్, లేక్‌వ్యూ అతిథి గృహంపైనా చర్చ జరగనుంది. దీంతో, రేవంత్ ప్రతిపాదిస్తున్న ఈ అంశాల పైన చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు.. ఈ భేటీలో ఇద్దరు సీఎంలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి కరంగా మారుతోంది.