UPDATES  

NEWS

 ఏపీలో ఇసుక ఫ్రీ.. ఈ నెల 8 నుంచి అమలు..!

ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా చార్జీలను నిర్ణయించనున్నట్లు సమాచారం.

 

ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2014- 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో అమలులో ఉన్న ఇసుక విధానం, 2019-2024 మధ్య అమ్మకాల లాభ, నష్టాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. గత ఐదేళ్లుగా ఇసుక అమ్మకాల పేరుతో భారీగా దోపిడి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్రీ ఇసుక పాలసీ ద్వారా పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని నిర్ణయించుకుంది.

 

ఇసుక అమ్మకాల విధానంలో ఎవరు లబ్దిపొందారు అనే దానిపై ఆరా తీసారు. జగన్ పాలనలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అంతే కాకుండా గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక డంప్‌లు వైసీపీ నేతలు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న సమాచారం ఉందని తెలిపారు. వైసీపీ నేతలు భారీగా ఇసుక ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |