UPDATES  

NEWS

 ‘కల్కి 2898ఏడీ’ సెకండ్ ట్రైలర్ లీక్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై హైప్ మామూలుగా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి మూవీ పేరే.. ఎక్కడ విన్నా కల్కి మూవీ విజువల్ ఎఫెక్ట్సే. అదీగాక ఈ మూవీ రిలీజ్‌కు ఇంకా కొద్ది రోజులు ఉండటంతో ఏ చిన్న ఫొటో, వీడియో లీక్ అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. అంతేకాకుండా మూవీ మేకర్స్ కూడా అదే లెవెల్లో చిన్న చిన్న అప్డేట్‌లు ఇస్తూ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.

 

అయితే ఇటీవలే కల్కి మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో రికార్డుల వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోయింది. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ మార్వెల్ మూవీ మాదిరిగా ట్రైలర్ ఉండటంతో అందరి కళ్లు ఈ మూవీపైనే పడ్డాయి. అదీగాక రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ హీరో హీరోయిన్లు సందడి చేసిన తీరుకు సినీ అభిమానులు ఫిదా అయిపోయారనే చెప్పాలి.

 

అయితే ఇదంతా ఒకెత్తయితే ఈ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సెకండ్ ట్రైలర్‌ను మూవీ రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ ట్రైలర్‌కు సంబంధించి ఓ లీక్ బయటకొచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. అలా లీక్ అయిన చిన్న వీడియో ప్రకారం.. ఈ సెకండ్ ట్రైలర్ వీడియోలో విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్‌లో చూపించని భారీ సీన్లను ఈ సెకండ్ ట్రైలర్‌లో చూపించనున్నట్లు ఈ లీక్ అయిన వీడియో చూస్తే అర్థం అవుతోంది.

 

కాగా ఈ సెకండ్ ట్రైలర్‌లో మృణాల్ ఠాకూర్ కూడా కనిపించి కనువిందు చేసింది. అందులో మృణాల్ కడుపులో ఒక లైట్ స్పీడ్‌గా వస్తున్న విజువల్ అయితే మరింతగా అదిరిపోయింది. అలాగే ఫైట్ సీన్లు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. అయితే దీని బట్టి చూస్తుంటే.. మృణాల్ ఇందులో కల్కి తల్లి పాత్ర అయిన సుమతి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సెకండ్ ట్రైలర్ లీక్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కాగా ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |