UPDATES  

NEWS

 విద్యుత్ కొనగోళ్లలో కేసీఆర్‌కు మరో షాక్..!

తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొనుగోళ్లు వివాదం మాజీ సీఎం కేసీఆర్ మెడకు గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య కరెంటు కొనుగోళ్ల వివాదం మాటల యుద్ధానికి కారణం అవుతుంది. జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కరెంటు కొనుగోళ్ల వివాదం రాజకీయంగా రగడకు కారణంగా మారింది.

 

కేసీఆర్ పవర్ కమీషన్ కు రాసిన లేఖతో రాజకీయ రగడ పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు విద్యుత్ కొనుగోలు పై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయగా కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కి సమాధానమిచ్చిన కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని లేఖ రాయడంతో అగ్గి రాజేసినట్టయ్యింది. కెసిఆర్ రాసిన లేఖ పైన భట్టి విక్రమార్క స్పందించడం, ఇదే సమయంలో డిస్కంలు తెరపైకి రావడం కూడా జరిగిపోయాయి.

 

తెరమీదకు డిస్కంలు గత ఒప్పందాల కారణంగా తెలంగాణకు నష్టం జరిగిందని డిస్కంలు కమిషన్ కు చెప్పినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కేసీఆర్ ను, గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుండగా ఎక్కువ రేటు చెల్లించి ఛత్తీస్గడ్ నుంచి కొనుగోలు చేశారని అందువల్లే నష్టం జరిగిందని పవర్ కమిషన్ ముందు డిస్కంలు చెప్పినట్టు సమాచారం.

 

గత ప్రభుత్వం చేసింది చెప్పిన డిస్కంలు ఒక్కో యూనిట్ 3 రూపాయల 90 పైసలకు కొనుగోలు చేసేందుకు చత్తీస్గడ్ ప్రభుత్వంతో గత తెలంగాణ ప్రభుత్వం పిపిఏ చేసుకుందని అయితే చివరకు కరెంటు సరఫరా అయ్యే సమయానికి దాని ధర యూనిట్ కు ఐదు రూపాయల 64 పైసలుగా మారిందని ఫలితంగా 3110 కోట్ల అదనపు భారం పడిందని సమాచారం. ఇక ఇదే విషయాన్ని డిస్కౌంట్ లు కమిషన్ కు వెల్లడించాయనీ చెబుతున్నారు.

 

కేసీఆర్ చెప్తుంది..డిస్కంలు చెప్తుంది వేరే అయితే ఇప్పటికే తెలంగాణ డిస్కంలు తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించాలని చత్తీస్గడ్ విద్యుత్ సంస్థలు విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేయగా దీనిపై విచారణ జరుగుతుంది. ఇదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వం మారింది. తాజాగా కెసిఆర్ చతిస్గడ్ కరెంటు కొనుగోలు లో పారదర్శకంగా జరిగిందని చతిస్గడ్ తో జరిగిన పిపిఏ ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిందని పేర్కొన్నారు.

 

ఈఆర్సి ఆమోదం లేకుండానే విద్యుత్ కొనుగోళ్ళు అయితే ఇంతవరకు చత్తీస్గడ్ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ఈఆర్సి తుది ఆమోదముద్ర వేయలేదని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి.తొలుత చేసుకున్న పీపీఏ పై తెలంగాణ ఈఆర్ సి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేసిందని, ఆ తరువాత తుది ఆమోదం పొందాల్సి ఉన్నప్పటికీ 2017 నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆమోదం పొందలేదని ఈఆర్సి పేర్కొంది.

 

అన్నీ అడ్డదారిలోనే చెల్లింపులు.. కేసీఆర్ ఇరకాటంలో ఆమోదం పొందని కారణంగా చత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుకు జరిగిన చెల్లింపులు అన్ని అడ్డదారిలోనే జరిగినట్టుగా పరిగణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చెల్లింపులతో డిస్కంలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని డిస్కంలు చెబుతున్నాయి. ఇంతటికీ కారణం ఫైనల్ గా కేసీఆర్ దగ్గరే ఆగుతుండటంతో ఈ వ్యవహారం కేసీఆర్ ను ఇరకాటంలో నెడుతున్నట్టు కనిపిస్తుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |