తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రౌప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. ఇటీవలే కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించనుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండగా.. క్వాలిఫైయింగ్ పేపర్‌గా జనరల్ ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గం. నుంచి 5:30 గం. వరకు నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
పరీక్ష షెడ్యూల్
జనరల్ ఇంగ్లీష్– అక్టోబర్ 21
పేపర్ 1 జనరల్ ఎస్సే– అక్టోబర్ 22
పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ– అక్టోబర్ 23
పేపర్ 3 ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్, భారత రాజ్యాంగం– అక్టోబర్ 24
పేపర్ 4 ఎకానమీ & డెవలప్‌మెంట్– అక్టోబర్ 25
పేపర్ 5 సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్– అక్టోబర్ 26
పేపర్ 6 తెలంగాణ ఉద్యమ చరిత్ర– అక్టోబర్ 27
ప్రిలిమ్స్ పరీక్ష కఠినతరంగా వచ్చిందని అభ్యర్థులు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రాథమిక కీ విడుదల చేయాల్సి ఉంది. గురువారం(జూన్ 13) ప్రాథమిక కీ ను విడుదల చేయనున్నట్లు కమిషన్ వెబ్ నోట్ విడుదల చేసింది. 1:50 నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మల్టీజోన్ 1,2 వారిగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది కమిషన్.
ఇప్పటికే రెండు సార్లు రద్దైన గ్రూప్-1 పరీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పాత నోటిఫికేషన్‌కు మరో 63 పోస్టులు జోడించి మొత్తంగా 563 పోస్టులకు జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించింది