UPDATES  

NEWS

 ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం..!

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో మే 27న జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ముగిసింది. అత్యధిక ఓట్లు సాధించిన తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి.

 

బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై మల్లన్న విజయం సాధించారు. ఈ ఎన్నికలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ కుమార్, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ప్రాధాన్యత ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేషన్‌కి గురయ్యారు.శుక్రవారం రాత్రి వరకు సాగిన కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. అయితే, సాంకేతికంగా ఓడినా, నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్లు వ్యాఖ్యానించారు.

 

కాగా, అంతకుముందు గురువారం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.

 

ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్‌ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అభ్యర్థి గెలుపునకు 1,55,095 ఓట్లు కావాలి. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తంగా 3,10,189 ఓట్లు పోల్‌కాగా, 25,824 ఇన్‌వ్యాలిడ్‌ ఓట్లు నమోదయ్యాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |