ఏపీ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు మూడు పార్టీల నేతలతో తన కొత్త కేబినెట్ కూర్పు పై చంద్రబాబు ఫోకస్ చేసారు. పలువురు సీనియర్లు కేబినెట్ రేసులో ఉన్నారు. జనసేన, బీజేపీ నుంచి ఆశావాహులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ – సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ..యువత – మహిళకు గుర్తింపు ఇస్తూ కేబినెట్ సిద్దం అవుతోంది.
కేబినెట్ కసరత్తు చంద్రబాబు కేబినెట్ లో మొత్తం 25 మందికి అవకాశం ఉంది. కాపు, బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీనియర్లు – యువతకు ప్రాధాన్యత ఇస్తూ కూర్పు జరుగుతున్నట్లు సమాచారం. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్, కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి పేర్లు రేసులో ఉన్నాయి. పశ్చిమ గోదావరి నుంచి పితాని, నిమ్మల రామానాయుడు, రఘురామరాజు ఉన్నారు. క్రిష్ణా జిల్లా నుంచి పార్ధసారధి, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, బీజేపీ నుంచి గెలిచిన కామినేని, సుజనా చౌదరి తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఛాన్స్ దక్కేదెవరికి గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్ కుమార్, ప్రకాశం నుంచి ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయ స్వామి, నెల్లూరు నుంచి నారాయణ, ఆనం, సోమిరెడ్డి కి ఛాన్స్ కనిపిస్తోంది. అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బీసీ జానర్ధన్ రెడ్డి, కడప నుంచి సుధాకర్ యాదవ్, మాధవీ రెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మైనార్టీల నుంచి ఫరూక్, మహిళల నుంచి బండారు శ్రావణి, ఎస్టీల నుంచి శిరీషాదేవి, బీసీల నుంచి యనమల దివ్య, పెనుగొండ గెలిచిన సవిత పేర్లు రేసులో ఉన్నాయి. వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
మిత్రపక్షాలకు ఛాన్స్ ఇక..జనసేన నుంచి ముగ్గురికి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పవన్ కేబినెట్ లోకి వస్తారా రారా అనేది తేలాల్సి ఉంది. నాదెండ్ల మనోహర్, కొణతాల రామక్రిష్ణ, బొలిశెట్టికి ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీ నుంచి ఇద్దరికి ఛాన్స్ దక్కనుంది.అందులో సుజనా చౌదరి,కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజు లో ఇద్దరికి ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే..సీనియార్టీ – యువత కాంబినేషన్ అమలు చేస్తూ…మూడు రీజియన్లక ప్రాధాన్యత ఇస్తూ..సామాజిక సమీకరణాల ఆధారంగా చంద్రబాబు తన మంత్రివర్గం కు తుది రూపు ఇవ్వనున్నారు. దీంతో..టీడీపీ సీనియర్లలో చంద్రబాబు చివరికి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది.








