UPDATES  

NEWS

 ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్..?

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ‘NTR 31’ మూవీ అత్యంత ప్రతిష్మాత్మకంగా తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాస్ అండ్ రగ్గడ్ లుక్ ఓ రేంజ్‌లో ఉండబోతుంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ అండ్ హీరోయిన్‌కి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ అండ్ క్యూటీ బ్యూటీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. మరి ఆమె ఎవరో, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనే విషయానికొస్తే..

 

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో ప్రభాస్‌ను ఓ రేంజ్‌లో చూపించి ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని లుక్‌లో ప్రభాస్‌ను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. కటౌట్‌కి తగ్గ డైలాగ్‌లు.. డైలాగ్‌లకు తగ్గ యాక్షన్ సీన్లతో బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో సలార్ కలెక్షన్లలో దుమ్ము దులిపేసింది.

 

అయితే సలార్ తర్వాత సీక్వెల్‌గా సలార్ 2 కూడా రానుందంటూ మేకర్స్ తెలిపారు. ఈ సీక్వెల్‌ ఈ ఏడాదే స్టార్ట్ అవుతుందా? లేదంటే ప్రశాంత్ నీల్ మరెదైనా సినిమాను పట్టాలెక్కిస్తాడా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ 2కి ముందు ఎన్టీఆర్‌తో NTR 31 మూవీని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌పై ఓ వార్త బయటకొచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారని సమాచారం. అంతేకాకుండా మెక్సికోలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఒక్క మెక్సికోలోనే కాకుండా దాదాపు 15 దేశాల్లో ఈ మూవీని చిత్రీకరించనున్నట్లు సమాచారం. అయితే ఈ అప్డేట్‌తో పాటు మరో అప్డేట్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది.

 

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మక మందన్న నటించే ఛాన్స్ ఉందని టాక్ గట్టిగా నడుస్తుంది. దీనిపై అఫీషియల్ అప్డేట్ రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా వార్తలు సాగుతున్నాయి. ఈ విషయం తెలిసి అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘దేవర’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |