UPDATES  

NEWS

 తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి వచ్చే సీట్లివే..!

దేశంలో సార్వత్రికి ఎన్నికల ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌పై అందరి దృష్టి నెలకొంది. కాగా, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ దేశంలో మరోసారి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చేస్తున్నాయి. ఎన్డీఏకు 350కుపైగా సీట్లు వస్తాయని, ఇండి కూటమికి 150కిపైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఇక, తెలంగాణలోనూ బీజేపీ సత్తా చాటడం గమనార్హం.

 

తాజాగా, వెలువడిన జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 4-7 సీట్లు వస్తాయని తెలిపింది. అయితే, బీజేపీ మాత్రం 9 – 12 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెరో స్థానం దక్కే అవకాశం ఉందని వెల్లడించింది.

 

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ఇలా..

 

తెలంగాణా లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీకి 7-10 సీట్లు, దాదాపు 37% ఓట్ల వాటాను అంచనా వేసింది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌కు దాదాపు 34% ఓట్లతో 5-8 సీట్లు రావచ్చు.

 

భారత్ రాష్ట్ర సమితి (బీర్‌ఎస్), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)తో సహా ఇతరులు 3-5 సీట్లు సాధించవచ్చని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్‌కి 21%, ఏఐఎంఐఎంకి 3% ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

 

తెలంగాణలో ఆరా సర్వే ఎగ్జిట్ పోల్స్

 

ఆరా సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని పేర్కొంది. తెలంగాణలో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని తేల్చేసింది. ఇక, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ తర్వాత స్థానంలో ఉంది.

 

బీజేపీకి 8 నుంచి 9 సీట్లు కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 సీట్లు ఎంఐఎం పార్టీకి ఒక్క స్థానం

 

అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే పేర్కొనడం గమనార్హం. దీంతో తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి నిరాశ కలిగించేలా ఉన్నాయి. ఏది ఏమైనా జూన్ 4న విడుదలయ్యే అసలైన ఫలితాల కోసం వేచిచూడాల్సిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |