UPDATES  

NEWS

 చార్మినార్ వద్ద కేటీఆర్.. హై టెన్షన్, రాజకీయకుట్రలో భాగమే రాజముద్ర మార్పని ఆగ్రహం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంలో ప్రభుత్వం చేపట్టిన మార్పుల నేపధ్యంలో అధికార కాంగ్రెస్, BRS మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్న పరిస్థితులతో పాటు, నేడు బీఆర్ఎస్ చార్మినార్ వద్ద ధర్నాకు దిగడంతో రాష్ట్రంలో హై టెన్షన్ చోటుచేసుకుంది. తెలంగాణ అధికారిక చిహ్నం నుండి చార్మినార్ ను, కాకతీయ కళా తోరణాన్ని తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ నేడు చార్మినార్ వద్ద ధర్నా చేపట్టింది.

 

గత పదేళ్ళ అభివృద్ధి కనిపించకుండా చెయ్యాలనే ఇలా ఈ క్రమంలో నేటి ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు K తారక రామారావు పాల్గొన్నారు. ఆయన చార్మినార్ ని సందర్శించి మాట్లాడుతూ, పదేళ్ళ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఎంతో వైభవంగా జరగాలనీ, అయితే గత పదేళ్ళలో జరిగిన అభివృద్ధిని కనిపించకుండా చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

 

చార్మినార్ గురించి కేటీఆర్ ఏమన్నారంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని విస్మరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కాకతీయ కళా తోరణం, చార్మినార్ ప్రతీకలను అధికార చిహ్నం నుంచి తొలగిస్తున్నట్లు ఆరోపిస్తూ, శతాబ్దాలుగా హైదరాబాద్‌కు చార్మినార్ ప్రతీకగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిందన్నారు. హైదరాబాద్ అనగానే ఎవరికైనా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చార్మినారే గుర్తు వస్తుందని చెప్పారు.

 

రాజకీయ కుట్ర తోనే కాంగ్రెస్ సర్కారు రాజముద్ర మార్పు రాష్ట్ర ప్రభుత్వం ఏవో కారణాలతో ఐకానిక్ చార్మినార్‌ను రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని చూస్తోందనీ KTR ఆరోపించారు. రాజకీయ కుట్ర తోనే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగా రాజముద్రను మార్పు చేయాలని నిర్ణయించిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అధికారిక ముద్ర నుండి చార్మినార్ ను, కాకతీయ కళా తోరణాన్ని తొలగించే కుట్ర జరుగుతోందని, కెసిఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 

రేవంత్ వి పనికిమాలిన చర్యలు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత కూడా రేవంత్ రెడ్డికి లేదన్నారు. అసలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ఇట్లాంటి పనికిమాలిన చర్యలకు దిగడం సరికాదని విమర్శించారు. అసలు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సమయంలో అధికారిక రాజముద్రను మార్చాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

 

వరంగల్ లోనూ ఆందోళనలు ఇదిలా ఉంటే కాకతీయుల వైభవానికి ప్రతీక అయిన కాకతీయ కళా తోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించడం పైన అటు వరంగల్ లోను బి ఆర్ ఎస్ శ్రేణులు ఖిలా వరంగల్లో నిరసన వ్యక్తం చేశారు. నేడు ఖిల్లా వరంగల్ లో బిజెపి నాయకులు సైతం నిరసన వ్యక్తం చేశారు..

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |