UPDATES  

NEWS

 బుజ్జితో భైరవ ఎంట్రీ అదుర్స్…!

బుజ్జి.. బుజ్జి.. బుజ్జి అంటూ ఎదురుచూసిన ఫ్యాన్స్ కు బుజ్జి ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ప్రభాస్ తన జీవితంలోకి ఆహ్వానించిన బుజ్జి బాడీ బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఉంది. కల్కి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంది. టోటల్ గా బుజ్జి అదిరిపోయింది. ఎహే అసలు ఎవరు బుజ్జి అని తెలియని వారున్నారా.. ? అయితే చెప్తా వినండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతూన్న చిత్రం కల్కి2898 AD.

 

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మూడు రోజుల క్రితం బుజ్జి అనే కీలక పాత్రను పరిచయం చేస్తామని మేకర్స్ చెప్పగానే దీపికా.. దిశానా అని అనుకున్నారు. కానీ, బుజ్జి అంటే ఒక వెహికల్. కారు లాంటిది. కానీ కారు అనలేం. బుజ్జి మాట్లాడుతుంది కూడా. హీరోయిన్ కీర్తి సురేష్ బుజ్జికి ఓవర్ ఇచ్చింది.

 

ఇప్పటికే బుజ్జి బ్రెయిన్ ను పరిచయం చేసిన మేకర్స్ తాజాగా బుజ్జి బాడీని పరిచయం చేశారు. ఈ కారు మన ఊహలకు అందనిదిగా ఉంది హాలీవుడ్ రేంజ్ లో కారును తయారుచేసిన విధానం నభూతో నభవిష్యత్ అని చెప్పొచ్చు. దీనికి కేవలం మూడు టైర్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ కారులో ప్రభాస్ రాయల్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బుజ్జి- భైరవ కాంబో సినిమాలో హైలైట్ అని టీజర్ ను బట్టి తెలుస్తోంది. బుజ్జి ఫన్నీ డైలాగ్స్.. భైరవ దాన్ని ఆపడం చాలా కామెడీగా కనిపిస్తుంది. ఇక ఈ కారులోనే ప్రభాస్ యుద్దాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ బుజ్జి టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |