UPDATES  

NEWS

 దొరికిపోయిన నటి హేమ.. అదిరిన బెంగుళూరు పోలీసుల ట్విస్ట్..!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రముఖ నటి హేమ ఈ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. ఆమె సంబంధించిన ఓ ఫొటోను కూడా విడుదల చేశారు. మొదటగా కర్ణాటక మీడియా, సోషల్ మీడియా హేమ పార్టీలో ఉన్నట్లు చెప్పాయి. అయితే దీన్ని ఖండిస్తూ హేమ ఓ వీడియో విడుదల చేశారు. ఆమె ఓ చెట్టు కింద ఉండి వీడియో చేశారు.

 

తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు చెప్పారు. తనకు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పేరును అనవసరంగా కర్ణాటక మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని చెప్పారు. తాను హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా నిజమని అందరు నమ్మారు. కానీ బెంగుళూరు పోలీసులు ఫొటో విడుదల చేయడంతో ఆమె రేవ్ పార్టీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు విడుదల చేసిన ఫొటోలో హేమ ధరించిన దుస్తులు.. ఆ వీడియో చేసేటప్పుడు ధరించిన దుస్తులు కూడా ఒకే రకంగా ఉన్నాయి.

 

దీంతో ఆమె పార్టీలో పాల్గొన్నట్లు కన్ఫామ్ అయింది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలిసింది. దాదాపు పార్టీలో 100 మంది పాల్గొన్నట్లు సమాచారంలో ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ తెల్లవారుజాము 3 గంటల వరకు జరిగినట్లు తెలిసింది. పోలీసుల రాక పార్టీ ఆగిపోయింది.

 

పోలీసులు పార్టీలో కొకైన్ తో పాటు డ్రగ్స్ కూడా గుర్తించారు. ఆ ఫామ్ హౌస్ లో ఉన్న ఓ కారుపై ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ తో పాటు ఆయన పేరుతో పాస్ పార్టు కూడా ఉన్నట్లు సమాచారం. తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. అయితే ఈ పార్టీలో పెద్ద తలకాయలే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |