UPDATES  

NEWS

 కౌంటింగ్ వేళ కీలక ప్రాంతాల్లో పోలీసు అధికారులకు పోస్టింగ్స్..!

ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల రోజు, ఆ తరువాత చోటు చేసుకున్న హింస పైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పలువురి అధికారుల పై చర్యలు తీసుకుంది. కొందరిని సస్పెండ్ చేయగా..మరి కొందరిని బదిలీ చేసింది. దీంతో కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సస్పెండ్ చేసిన అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించారు.

 

ఎన్ని కల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల బాధ్యులు కావడంతో సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు వచ్చాయి. నరసరరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరరావు, తిరుపతి డీఎస్సీగా కే.రవి మనోహర్ చారి, తాడిపత్రి డీఎస్పీగా కే జనార్దన్ నాయుడు, తిరుపతి ఎస్‌బీగా ఎం వెంకట్రాది, పల్నాడు స్పెషల్ బ్రాంచ్ సీఐలుగా బీ.సురేష్ బాబు, యూ.శోభన్ బాబులు, కారంపూడి ఎస్‌ఐగా కే.అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా ఎం పట్టాభి, తిరుపతి ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా ఏ విశ్వనాథ్ ను నియమించారు.

 

చంద్రగిరి టీడీపీ అభ్యర్ది పులివర్తి నాని పైన దాడి జరిగిన ప్రాంతం అలిపిరి సీఐగా ఎం రామారావు, తాడ్రిపత్రి సీఐగా పీ.నాగేంద్ర ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ అధికారులు అందరినీ తక్షణమే విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ డీజీపీకి ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు అధికారుల పేనల్‌లో ఒకరిని ఎంపిక చేసి ఎన్నికల సంఘం పోస్టింగులు ఇచ్చింది. కాగా ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలను అరికట్టలేకపోవడంతో మొత్తం 13 మంది పోలీసు అధికారులను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. హింసాత్మక ఘటనల పైన విచారణ చేసిన సిట్ అధికారులు డీజీపీకి ప్రాధమిక నివేదిక అందించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |