UPDATES  

NEWS

 కౌంటింగ్ ముందు కీలక నేతల పై సిట్ గురి..!

ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనల పై ఈసీ సీరియస్ అయింది. పోలింగ్ ముగిసే వేళ పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది. దీని పైన వైసీపీ, టీడీపీ ఒకరి పై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈసీకి ఫిర్యాదులు అందాయి. నేరుగా సీఎస్, డీజీపీని తమ వద్దకు పిలిపించిన ఈసీ ఉన్నతాధికారులు ఈ ఘటనల పైన సిట్ కు ఆదేశించింది. పలువురు అధికారులను మార్పు చేసింది. హింస జరిగిన ప్రాంతాల్లో విచారణ చేస్తున్న సిట్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

 

విచారణ వేగవంతం ఏపీలో ఎన్నికల హింస పైన సిట్ విచారణ వేగవంతం చేసింది. పల్నాడు, చంద్రగిరి, అనంతపురం జిల్లాల్లో హింస పైన క్షేత్ర స్థాయి సమాచారాన్ని సేకరించారు. అల్లర్ల పైన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసిన సిట్..91 మందిని అరెస్ట్ చేసింది. ఈ అల్లర్ల వెనుక అసలైన కారకులను గుర్తించే పని మొదలు పెట్టింది.

 

దీంతో..ముఖ్యనేతలను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కౌంటింగ్ కు సిద్దం అవుతున్న వేళ ఈ అంచనాలు ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. ప్రధానంగా పల్నాడు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో అల్లర్లపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించింది.

 

కారకులపై ఫోకస్ తాడిపత్రికి చేరుకున్న సిట్ బృందం అర్థరాత్రి వరకు విచారణ కొనసాగించింది. పోలింగ్ రోజు మొదట ఓం శాంతి నగర్‎లో రాళ్లదాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు సిట్ అధికారులు. పోలింగ్ మరుసటి రోజు 14వ తేదీన టిడిపి నాయకుడు సూర్యముని ఇంటిపై రాళ్లదాడి జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించింది.

 

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర తాడిపత్రిలోని అన్ని ప్రాంతాలను సందర్శించి రిపోర్టును రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎదురుగా ఉన్న జూనియర్ కాలేజీ గ్రౌండ్‎నుకూడా జల్లడపట్టారు. తిరుపతి, తాడిపత్రలోనూ

 

ఈసీకి నివేదిక రాళ్ల దాడి జరిగిన ప్రాంతాలన్నింటినీ సీక్వెల్‎గా పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు సిట్ అధికారులు. దర్యాప్తులో భాగంగా సిట్ బృందం పరిశీలించనుంది. రాళ్లదాడి అనంతరం.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై పోలీసులు జరిపిన దాడులను, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సృష్టించిన విధ్వంసంపై కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై రిపోర్టు తయారు చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించనుంది. ఇప్పటికే తాడిపత్రిలో అల్లర్లు, రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి చాలామందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |