ఏపీలో ఎన్నికల ఫలితాల పై భిన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ పూర్తయిన ఇంకా గెలుపు లెక్కల పైన సస్పెన్స్ కొనసాగుతోంది. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇటు చంద్రబాబు అమెరికా వెళ్లారు. పోలింగ్ తరువాత ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటలనతో ఈసీ అలర్ట్ అయింది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ వేళ అధికారులకు కీలక మార్గదర్శకం చేసింది.
ఈసీ అలర్ట్ ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ సిరీయస్ అయింది. కౌంటింగ్, తదనంతరం జరిగే పరిణామాలపై ఈసీ ఫోకస్ పెంచింది. కౌంటింగ్ రోజు మాత్రమే కాకుండా ఆ తర్వాత 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారికి సూచన చేసింది. రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది. ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇవాళో రేపు మరో 5కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి.
సీఈఓ పరిశీలన మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూంల దగ్గర భద్రతను రెండెంచల నుంచి మూడంచెలకు పెంచింది.స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ ఏర్పాట్లను సీఈవో మీనా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళంలో పర్యటించిన మీనా.. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ తో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతను స్వయంగా పరిశీలించారు. మూడెంచల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్కు సూచించారు.
రాజకీయ ఉత్కంఠ అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. అధికారం పైన రెండు పక్షాల నుంచి అంచనాలు భారీగా ఉండటంతో తుది ఫలితం పైన రాజకీయంగానూ ఉత్కంఠ కొనసాగుతోంది.









