లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన ఆరు నెలల్లోకా పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)ను ఇండియాలో కలుపుతామన్నారు. యోగి ఆదిత్యనాథ్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా శనివారం మహారాష్ట్రంలోని పాల్టర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కాపాడుకోవడానికి పాక్ ఇబ్బంది పడుతుందని యోగి అన్నారు.
మూడోసారి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పీఓకేను భారత్ లో కలుపుతామని అన్నారు. అదే సమయంలో ప్రతి భారత పౌరుడికి రక్షణతో పాటు ఉపాధి కల్పించడం ప్రథమ కర్తవ్యమన్నారు. ప్రతి మహిళకు రక్షణ కల్పించాలని.. అలాగే వ్యాపారస్థలకు రక్షణ కల్పించాలన్నారు. ప్రతి యువకుడికి కూడా ఉపాధి కల్పించాల్సి బాధ్యత ఉందన్నారు. కొన్ని రోజుల క్రితం నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో అధిక ద్రవ్యోల్బణం, భారీ పన్నులు, విద్యుత్ కొరత ఉంది.
దీంతో అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని భారత్ లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. పై వందలాది మంది నిరసనకారులు పాకిస్తాన్-ఆక్రమిత కాశ్మీర్ (PoK) వీధుల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు అసోం సీఎం హిమంత శర్మ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలను ప్రస్తావించారు. “పీఓకే భారతదేశంలో భాగమే.. మేము దానిని తీసుకుంటాము” అని అన్నారు.
“2019లో ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్‌లో శాంతి తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకుముందు కాశ్మీర్ లో ఆజాదీ నినాదాలు వినిపించగా, ఇప్పుడు పీఓకేలో కూడా అదే నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కాశ్మీర్ లో రాళ్లు రువ్వారు, ఇప్పుడు పీఓకేలో రాళ్లు రువ్వుతున్నారు” అని అమిత్ షా అన్నారు.









