ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోరు పీక్స్ కి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్న ప్రధానపార్టీల ముఖ్య నాయకులు మాటల తూటాలను పేలుస్తున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , వైయస్ సుబ్బారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి లపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణపట్నం పోర్ట్ లో కంటైనర్ టెర్మినల్ తరిమేసింది ఆయనే ఈ ఐదుగురు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వారు పాలకులు కాబట్టే ప్రజాస్వామ్యం విలవిలలాడుతోంది అని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కృష్ణపట్నం పోర్ట్ లో కంటైనర్ టెర్మినల్ ని కాకాణి గోవర్ధన్ రెడ్డి తరిమేశారు అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. దీనివల్ల పదివేల మందికి ఉపాధి పోయిందన్నారు.
అక్రమ సొమ్ముతో కాకాణి బలిసిపోయారు వైసిపి నేతలు గుట్టలు, కొండలు, చెరువులు వేటిని వదిలిపెట్టడం లేదని, సిలికాలో 4500 కోట్లు, క్వార్ట్జ్ లో నాలుగు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పోరాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బక్క చిక్కి పోతే, అక్రమ సొమ్ముతో కాకాణి బలిసి పోయారు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాకాణికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వైసిపి దుర్మార్గపు పాలనను పాతి పెట్టాలన్నారు చంద్రబాబు.
రాష్ట్రంలో జరుగుతున్నది క్లాస్ వార్ కాదని క్యాష్ వార్ జగన్ హయాంలో అన్ని స్కామ్ లేనని, రాష్ట్రమంతా జగన్ బాదుడే ఎక్కువ ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని, వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని చంద్రబాబు శాపనార్థాలు పెట్టారు. కేజిఎఫ్ 1, 2 చూడాలంటే కోలార్ పోవాలని, కేజిఎఫ్ 3 చూడాలంటే సర్వేపల్లి రావాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నది క్లాస్ వార్ కాదని క్యాష్ వార్ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అప్పుడు కోడికత్తి డ్రామా.. ఇప్పుడు గులకరాయి డ్రామా మొన్న కోడి కత్తి డ్రామా , ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ ఈ దాడులు టిడిపి చేయించిందని వైసీపీ నేతలు చెప్తున్నారని మండిపడ్డారు. తల్లిని చూడని వాడు, చెల్లికి అన్యాయం చేసిన వాడు మనకేం చేస్తాడో ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో వైసీపీని ఓడించి తీరాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









