UPDATES  

NEWS

 ఈనెల 18న ఏపీ ఎన్నికల నోటిఫికేషన్: ఈసీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 18వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈరోజు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో పర్యటించిన ఆయన ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని స్పష్టం చేశారు.

 

ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవే ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉందని, ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు. మే 13వ తేదీన రాష్ట్రంలో పారదర్శకంగా. స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.

 

ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నేడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పర్యటించారు. ప్రకాశం జిల్లా మద్దపాడు, సింగరాయకొండ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఆయన తనిఖీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులకు కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల పరిధిలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించారు.

 

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఆయన రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలలో క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును ఆయన స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నారు. ఎన్నికలు పకడ్బందీగా జరగటం కోసం ఆయన అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.

 

ఎన్నికల ప్రదానాదికారికి టీడీపీ బృందం ఫిర్యాదు అయితే ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను నేడు నిన్న రాత్రి ఒంగోలులో జరిగిన సంఘటన నేపథ్యంలో టిడిపి ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై రాజకీయ ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని, ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోవడంలేదని సింగరాయకొండ, ఒంగోలు రూరల్ ఎస్సై లపై చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |