UPDATES  

NEWS

 పవన్ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్ ఫస్ట్ లుక్ మామూలుగా లేదు భయ్యా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతేడాది బ్రో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘ఓజీ’ మూవీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 

ఈ మూవీలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ముంబై డాన్ పాత్రలో పవన్ కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఓ రేంజ్‌లో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

 

ముఖ్యంగా టీజర్‌లో పవన్ మాస్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం ఉన్న పవన్ ఇందులో తన లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 

కాగా ఈ మూవీలో శ్రియారెడ్డి, అర్జున్ దాస్, తేజ్ సఫ్రూతో సహా మరికొంత మంది నటీనటులు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ రోజు ఇమ్రాన్ హష్మీ బర్త్ డే. ఈ సందర్భంగా ఓజీ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

 

ఆ పోస్టర్‌లో ఇమ్రాన్ హష్మీ చాలా సీరియస్‌గా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. దీని బట్టి చూస్తే ఇమ్రాన్ ఇందులో ఓం భాయ్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ ఆయనకు ప్రత్యేక బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

 

ఇదిలా ఉంటే ఇమ్రాన్ హష్మీ తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రం ఓజీనే కావడంతో అందరిలోనూ మంచి హైప్ ఉంది. ఇక ఈ సినిమాతో పాటు యంగ్ హీరో అడివిశేష్ నటిస్తున్న గుఢాఛారి 2 మూవీలో కూడా ఇమ్రాన్ నటిస్తున్నాడు.

 

ఇకపోతే పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే.. పవన్ ఓజీ మూవీతో పాటు మరోవైపు ‘హరిహర వీరమల్లు’ మూవీ కూడా చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని దీపావళి నాటికి పూర్తి చేసి రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |