UPDATES  

NEWS

 తుక్కుగూడలో భారీ బహిరంగసభ.. ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న కాంగ్రెస్….

లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారు. కాగా ఈ సభలో ఏఐసీసీ మేనిఫెస్టోను ఖర్గే తెలుగులో విడుదల చేయనున్నారు.

 

కాగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న మొదటి బహిరంగ సభ ఇదే కావడం విశేషం. తుక్కుగూడ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టనుంది. ఈ మేరకు తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు కలిసి నిర్ణయం తీసుకున్నారు.

 

అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీలు వివరించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అదే సీన్ రిపీట్ చేయాలని అనుకుంటోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |