UPDATES  

NEWS

 రామ్ చరణ్ కొత్త మూవీ ప్రారంభం.. టైటిల్ ఇదేనా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త మూవీ షూటింగ్ షూరూ అయ్యింది. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభోత్సం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, స్టార్ డైరెక్టర్లు శంకర్, సుకుమార్, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ పాల్గొన్నారు. ఫిల్మ్ యూనిట్ కు విషెస్ చెప్పారు.

 

రామ్ చరణ్ కొత్త మూవీకి బుచ్చిబాబు డైరెక్టర్. ఉప్పెన మూవీతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడు కొంతకాలం క్రితమే చెర్రీకి కథ చెప్పాడు. స్టోరీ లైన్ నచ్చడంతో చరణ్ ఓకే చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూజా కార్యక్రమంలోనూ ఇదే అంశాన్ని చెర్రీ చెప్పాడు. కథ తనకు ఎంతో నచ్చిందన్నాడు. ప్రేక్షకులకు ఈ మూవీ బాగా నచ్చతుందన్నాడు.

 

ఉప్పెన చిత్రం బుచ్చిబాబుకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. బుచ్చిబాబుకు కూడా ఇదే తొలి మూవీ. ఆ తర్వాత అతడు మరో సినిమా దర్శకత్వం వహించలేదు. రామ్ చరణ్ ప్రాజెక్టు కోసం ఇన్నాళ్లూ ఎదురుచూస్తున్నాడు.

 

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ క్రీడా నేపథ్యంలో ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పల్లెటూరులో కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయిక జాన్వీకపూర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా RC16 ను నిర్మిస్తున్నాయి. పెద్ది అనే టైటిల్ పెడతారని టాక్ . మెగా పవర్ స్టార్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. దేవర మూవీలో జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇద్దరు కాల్షీట్లు కోసం నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. వెంటనే షూటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |