UPDATES  

NEWS

 ఆంధ్రా రాజకీయాలపై మోదీ ఫోకస్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సలహాలు,..

లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ అదే సమయంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో అధికారం దక్కించుకున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో చేతులారా అధికారం వదులుకున్న బీజేపీ మరోసారి అలాంటి పోరపాటు చెయ్యకూడదని డిసైడ్ అయ్యిందని తెలిసింది

 

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోకస్ పెట్టారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

 

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి చాలా దగ్గర బంధువులు కావడంతో బీజేపీ నాయకులు టీడీపీతో మరోసారి దోస్తీకి సై అన్నారు. గత 10 ఏళ్ల నుంచి మోదీ జపం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద నరేంద్ర మోదీకి మంచి అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

గత అసెంబ్లీ ఎన్నికలు (2019)లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తెలుగుదేశం పార్టీ తరువాత కాంగ్రెస్ కూటమిలో చేరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ సందర్బంలో జనసేన కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చెయ్యడంతో అదికాస్తా వైసీపీ కలసివచ్చింది. పవన్ కల్యాణ్ తో కలిసి పని చేసిన టీడీపీ 2014లో అధికారం దిక్కించుకుని తరువాత జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఎటూ కాకుండాపోయింది.

 

చేతులుకాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఐదు సంవత్సరాలకు పైగా బీజేపీకి, ఎన్డీఏ కూటమికి దూరం అయిన టీడీపీ ఇప్పుడు పవన్ కల్యాణ్ తో కలిసి మళ్లీ ఎన్డీఏ గూటికి దగ్గర అయ్యింది. తెలుగుదేశం, జనసేన కలిసి పని చెయ్యడానికి ఎన్డీఏ దగ్గరకు రావడంతో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ సీట్లతో పొత్తు పెట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో సత్తాచాటుకోవాలని ప్రయత్నిస్తున్నది. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ప్రజల ఆదరణ తక్కువగానే ఉందని బీజేపీ నాయకులతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణత్, పురందేశ్వరికి పలు సూచనలు చేశారని తెలిసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |