UPDATES  

NEWS

 ఈ రికార్డ్ ఒక్క ప్రభాస్‌కి మాత్రమే సాధ్యం.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో కాలంగా హిట్లు లేక సతమతమవుతున్న ప్రభాస్‌కి అలాగే ఆయన అభిమానులకి సలార్ మూవీ ఆకలి తీర్చింది.

 

ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి సినిమాపై ఫుల్ హైప్ ఉంది. అంతేకాకుండా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్‌లతో మరింత బజ్‌ను మేకర్స్ క్రియేట్ చేశారు. ఇక ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. చివరకి ఈ మూవీ గతేడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

ఇక ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే అదిరిపోయే టాక్‌ను అందుకుంది. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీశారు. ఈ మూవీలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన యాక్షన్ మార్క్ చూపించాడు. ప్రభాస్ అభిమానులకు ఎలాంటి ఆకలి తీర్చాలో అలాంటి తీర్చాడు.

 

ఇందులో ప్రభాస్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అతడి కటౌట్‌కి మాస్ డైలాగ్‌లకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఇక ఈ మూవీ సూపర్ రెస్పాన్స్‌తో పాటు భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లను సాధించింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది.

 

ఈ మూవీతో ప్రభాస్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే ప్రభాస్ తాజాగా మరో రికార్డును నెలకొల్పాడు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ (ఎక్స్) తాజాగా కొన్ని రిపోర్టులను రిలీజ్ చేసింది. అందులో ‘భారత్‌లోని టాప్ హ్యాష్‌ట్యాగ్‌ల’ లిస్ట్‌ను కూడా వదిలింది.

 

అందులో టాప్ 10 హ్యాష్ ట్యాగ్‌లలో నిలిచిన ఏకైక ఇండియన్ నటుడిగా ప్రభాస్ సంచలన రికార్డును క్రియేట్ చేశాడు. కాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ఈ టాప్ 10 హ్యాష్‌ట్యాగ్ లిస్ట్‌‌లో 9వ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.

 

ఇకపోతే ట్విట్టర్ (ఎక్స్)లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఇండియన్ సినిమాల లిస్ట్‌లో టాప్ 1లో లియో మూవీ నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ప్రభాస్ సలార్ ఉంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

ఇకపోతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘కల్కి 2898ఏడీ’ మూవీ ఒకటి. ‘మహానటి’ మూవీ ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ పై కూడా అందరినూ భారీ అంచనాలే ఉన్నాయి. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |