UPDATES  

NEWS

 సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కుమారీ ఆంటీ.. భారీ ఆఫర్లు..

స్టార్ మా, ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న షోలలో కొంచెం సేపే కనిపించినా అందరిని ఆకట్టుకుంది కుమారీ ఆంటీ. అయితే ప్రముఖ చానల్ జీ తెలుగులో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ పేరుతో ఒక సీరియల్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోలో కుమారీ ఆంటీ కనిపించింది. దీంతో ఈమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈమె సీరియల్స్ లో మరింత బిజీ అయితే ఈమె లైఫ్ కు తిరుగు ఉండదనే చెప్పాలి.

 

ఇప్పటికే ఈమె కెరీర్ పరంగా ఆలోచిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తుందనే టాక్ ఉంది. టీవీ షోలకు హాజరైనందుకు సీరియల్ షూటింగ్స్ లో పాల్గొన్నందకు రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటుందని టాక్. అయితే ఈమె హోటల్ లో కూడా ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. ఇలానే కంటిన్యూ అయితే ఈమె సినిమాల్లో నటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నెటిజన్లు. అయితే ఈమె యూట్యూబ్ వల్ల ఈ స్థాయికి చేరుకుందని కొందరి అభిప్రాయం. మరికొందరు ఆమె టాలెంట్ వల్లనే వచ్చిందని అంటున్నారు.

 

ఇక ఈమె ఫాలోయింగ్ చూసి సెలబ్రెటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈమె హాజరయ్యే ప్రోగ్రామ్స్ కు మంచి రేటింగ్స్ వస్తుండడం విశేషం. ఇక ఈమె హోటల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుందట. మొత్తం మీద ఈమె రేంజ్ రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. మరి చూడాలి ముందు ముందు ఎలా ఉండబోతుందో..

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |