UPDATES  

NEWS

 ఆస్కార్ వేదికపై మరోసారి ‘ఆర్ఆర్ఆర్’.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హవా..

ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. 96వ అకాడమీ అవార్డు వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలో అనుకోని సంఘటన జరిగింది. ఈ సంఘటన భారతీయులకు ఒక సర్‌ప్రైజ్ అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి 2024 ఆస్కార్ వేడుకలో మెరిసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

 

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ మూవీ 2022లో విడుదలై సూపర్ హిట్టు అందుకొని ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా కలెక్షన్లలో కూడా ఈ మూవీ దుమ్ము దులిపేసింది.

 

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లగొట్టి తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రపంచమంతా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ సినిమా అత్యున్నత సినీ అవార్డులు గెలుచుకుని 2023 ఆస్కార్‌ వరకు వెళ్లింది.

 

ఇక అక్కడ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో తొలి ఇండియన్ సినిమాగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది.

 

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాని, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమా సత్తాని చాటారు. దెబ్బకు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది.

 

అలాంటి ఈ మూవీని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. అందుకు నిదర్శనం తాజాగా జరిగిన 2024 ఆస్కార్ అవార్డు వేడుకే. తాజాగా అమెరికాలో ఈ వేడుక జరగగా.. అక్కడ ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు సాంగ్ తళుక్కున మెరిసింది.

 

అందుకు కారణం.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో బార్బీ సినిమాలోని ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?’ అనే సాంగ్‌కు గానూ బిల్లీ ఈలిష్, ఫిన్నియాస్ ఓకోనల్ అవార్డును అందుకోవాలని పిలిచారు.

 

ఆ సమయంలో గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్‌ లోని నాటు నాటు సాంగ్‌ విజువల్స్‌ను స్క్రీన్ బ్యాగ్రౌండ్‌లో ప్లే చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 

అలాగే నాటు నాటు సాంగ్ మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ యాక్షన్ సీన్ కూడా ప్లే చేశారు. ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

ఇక అందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ మూవీ టీం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేస్తూ.. ఆస్కార్ గడ్డపై మరోసారి ఆర్ఆర్ఆర్ అంటూ క్యాప్సన్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |