ఏపీలో ఎన్నికలకు ముందు అసైన్డ్ భూముల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని సీఐడీ వెల్లడించింది.
అసైన్డ్ భూముల కుంభకోణం విచారణలో నిర్ధారించిన అంశాలను సీఐడీ బయటపెట్టింది. మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల్లో కుంభకోణం జరిగిగినట్లు వివరించింది. 4,400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తేల్చింది. ఈ స్కామ్ లో చంద్రబాబును ముద్దాయిగా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఆయనతోపాటు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను కూడా ముద్దాయిగా తెలిపింది.
అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ జరిగిందిన సీఐడీ పేర్కొంది. రాజధాని నగర ప్రణాళిక పేరుతో చంద్రబాబు భూముల దోపిడికి పాల్పడ్డారని తేల్చింది. చంద్రబాబుతోపాటు ఆయన బినామీలు అసైన్డ్ భూములను దోచుకున్నారని సీఐడీ నిర్ధారించింది.
రికార్డులను ట్యాంపరింగ్ చేశారని సీఐడీ విచారణలో తేల్చింది. ఈ విధంగా భూముల స్కామ్ చేశారని నిర్ధారించింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ను ముద్దాయిలుగా సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.









