తెలంగాణ సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటి సంబంధిత ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు.
తెలంగాణలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును టాటా టెక్నాలజీస్ చేపట్టనుంది.
అలాగే 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సులు నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ విద్యాసంవత్సరం 2024-25 నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది









