UPDATES  

NEWS

 గ్యాస్‌ సిలిండర్లకు రాయితీ గడువు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం….

సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.పేద , మధ్య తరగతి వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై అందిస్తున్న రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పెంచింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

 

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955గా ఉంది. ఈ స్కీమ్ లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీ లభిస్తోంది. దీంతో వారు రూ. 655 కే గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. మార్చి నెలఖారుతో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏప్రిల్ నుంచి మరో ఏడాదిపాటు పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లపై రాయితీ ఇవ్వనుంది.

 

ప్రధాని మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 10 కోట్ల మంది లబ్ధిదారులు సబ్సిడీ పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారికి మరో ఏడాది ప్రయోజనం కలగనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |